ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. UIDAI కీలక నిర్ణయం

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు పెంపు.. UIDAI కీలక నిర్ణయం

ఆధార్ కార్డు హోల్డర్లకు UIDAI ముఖ్యమైన అప్‌డేట్‌ ఇచ్చింది. ఆధార్ సేవలకు సంబంధించిన ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవడానికి గతంలో రూ.50 ఉండగా, ఇప్పుడు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వేలిముద్రలు, కనుపాప వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ కోసం వసూలు చేసే ఛార్జీని రూ.100 నుంచి రూ.125కు పెంచింది. ఈ ఛార్జీలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమల్లో ఉంటాయని UIDAI తెలిపింది.

Post a Comment

أحدث أقدم