మణుగూరు: పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు 9 మంది అరెస్ట్....!



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మణుగూరు మండలం ఆదర్శనగర్‌లో పేకాట స్థావరాలపై నిన్న రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. 


9 మంది యువకుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 8030 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగబాబు, ఎస్సై నరేష్‌లు పేర్కొన్నారు.


జూదం, పేకాట వంటివి ఆడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. పేకాట ఆడితే పోలీసులకు  సమాచారం అందించాలని తెలిపారు.



ఇది కూడా చదవండి..


దూసుకొస్తున్న శక్తి తుఫాన్... తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు తప్పవా..



పండగ ముందు రోజు నుంచి తెలంగాణలో వర్షాలకు బ్రేక్ పడింది. అక్టోబర్ ప్రారంభం కావడంతో.. వర్షాకాలం ముగిసింది.. ఇక వానల బాధ తప్పినట్లే అని జనాలు భావిస్తున్నారు. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. 


దీనికి తోడు పలు మార్లు బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిశాయి. ఇక తెలంగాణలో సగటు కన్నా అధిక వర్షపాతం నమోదయ్యింది. అయితే అక్టోబర్‌లో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 


వారి మాట నిజమయ్యేలా ఉంది. ఇందుకు కారణం దూసుకొస్తున్న శక్తి తుపాను. అరేబియా సముద్రంలో ఏర్పడబోయే ఈ మొదటి తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండనుంది అంటే..


దేశ పశ్చిమ తీరం వైపుగా సైక్లోన్ శక్తి దూసుకొస్తుంది. ఈ సంవత్సరం అరేబియా సముద్రంలో తొలి తుపాను ఏర్పడబోతుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. 


ఈ అల్పపీడనం అరేబియా సముద్రంలో.. ద్వారక నగరానికి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో.. అలానే పోర్‌బందర్‌కు పశ్చిమ దిశలో 270 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరి ఈ తుపాను ప్రభావం తెలంగాణ మీద ఉండబోతుందా అంటే..


వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో ఇవాళ వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది.అయితే శాటిలైట్ అంచనాల ప్రకారం.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم