తెలంగాణ : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ కోతి అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. తన పిల్ల అనుకుని దానిని ముద్దాడుతూ చెట్లపైకి తీసుకెళ్లింది. కుక్క పిల్లను కింద పడేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ కోతి ప్రవర్తనను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నెట్టింట వైరల్ అవుతోంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి