మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ జి రవి తెలిపారు.సింగరేణి కోల్ మైన్స్ లో పని చేస్తున్నటువంటి ఎస్ఎంఎస్ కంపెనీలో టెక్నీషియన్, ఆపరేటర్స్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ జాబ్ మేళాకు ఐటిఐ పూర్తి చేసిన ఎలక్ట్రిషన్, ఫిట్టర్,డ్రాప్స్ మెన్ సివిల్, సర్వేయర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ కోర్సులు పూర్తి చేసిన వారు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు.
ఇది కూడా చదవండి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి