అడవిలో నడిరోడ్డుపై డిగ్రీ విద్యార్థినిని బస్సు దింపిన కండక్టర్

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



-- పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని కామిశెట్టి హేమలత మణుగూరు డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ప్రతిరోజు మణుగూరు నుండి పల్లె వెలుగు బస్సు ఎక్కి జానంపేట గ్రామ శివారు నాగులమ్మ గుడి దగ్గర బస్సు దిగుతానని, కానీ ఈరోజు మాత్రం TG28Z0014 బస్సు కండక్టర్ బస్సును తాను బస్సు ఆపమని ఎంత వేడుకున్నప్పటికీ, ఆపకుండా తనను జానంపేట -చేగర్సల దగ్గరలో ఉన్న అడవిలో దింపి వెళ్ళారని, ఏడుస్తూ తెలిపింది. అటు వైపుగా బైక్ పై వస్తున్న స్థానికులు తనను తన ఇంటి వద్ద దింపడం జరిగింది. పాఠశాల కాలేజీ విద్యార్థునీ విద్యార్థులకు వారి గమ్యస్థానాల వద్ద వారిని బస్సు ఆపే విధంగా  మణుగూరు డిపో మేనేజర్  డ్రైవర్లకు కండక్టర్లకు సూచన చేయాల్సిందిగా, విద్యార్థిని తల్లిదండ్రులు మండల ప్రజలు కోరుతున్నారు.

1 تعليقات

  1. అలాంటి వెదవల జాబ్ వెంటనే తీసేయాలి

    ردحذف

إرسال تعليق

أحدث أقدم