విరార్‌లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
పక్కనే ఉన్న చాల్‌పై పడిన అపార్ట్‌మెంట్ శిథిలాలు
గతంలోనే ప్రమాదకరమైనదిగా ప్రకటించిన మున్సిపల్ అధికారులు
రాత్రంతా కొనసాగిన ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
శిథిలాల కింద మరికొందరు వుండచ్చనే ఆందోళన
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగంతస్తుల నివాస భవనం ఒకటి కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని 'అత్యంత ప్రమాదకరమైనది'గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. శిథిలాల కింద ఇంకా 10 నుంచి 11 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
కామెంట్‌ను పోస్ట్ చేయండి