ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు
👉 *అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు*
తేది :23:07:2025 బుధవారం రోజునా కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ కార్యాలయంలోని గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా ములుగు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన రానున్న మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున కన్నాయిగూడెం మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం మండల ప్రజలను సూచించిన మండల ఇంచార్జి జాడి రాంబాబు గారు...
నదులు, వాగులు, వంకలు, చెరువులు,కుంటలు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్ల పైకి నీరు చేరే అవకాశం ఉన్నందున, కావునా కాళీ నడక మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఉదృతంగా ప్రవహించే ప్రదేశాల్లోకి వెళ్లి ప్రమాదనికి గురి కావద్దు....
ముఖ్యంగా చేపల వేటకు వెళ్లే జాలార్లు వెళ్ళకూడదు, పశువులు కాయడానికి రైతులు వాగులు వంకల, పరిసర ప్రాంతాలకు వెళ్ళకూడదు సాధ్యమైనంత వరకు అత్యవసరం అయితే తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రావద్దు,అలాగే మండల ప్రభుత్వ అధికారులు నిత్యం మండలంలో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది ప్రజలకు కావలసిన సదుపాయాలు చేయాలనీ కోరారు....
కన్నాయిగూడెం మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ కార్యకర్తలకు నమస్కారములు భారీ వర్షాల పట్ల ప్రతి గ్రామాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యం ప్రజాల్లో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు...
*మీ*
*కన్నాయిగూడెం మండలా కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి*
*జాడి రాంబాబు*
إرسال تعليق