మూడు నెలల ఫర్నిచర్ తయారీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం: జిల్లా కలెక్టర్



 భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (NSTI), అంబర్‌పేట్, హైదరాబాద్‌లో ఇచ్చే ఈ శిక్షణకు కనీసం పదో తరగతి పాస్ అయి, వయస్సు 30 సంవత్సరాల లోపు ఉన్న, కార్పెంటర్ పనిలో కొంత అనుభవం మరియు ఆసక్తి ఉన్న పురుషులు జూలై 29వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో NSTI ప్రతినిధి నుండి కోర్సు సంబంధిత పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ గారు తెలిపారు.


అదే రోజున ప్రీ-స్క్రీనింగ్ నిర్వహించబడుతుందని, మన జిల్లాకు చెందిన 10 మంది సభ్యులతో మొదటి బ్యాచ్ ఎంపిక చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు.


హైదరాబాద్‌లో మూడు నెలల పాటు స్వంత ఖర్చుతో ఉండి శిక్షణ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని Collector గారు కోరారు.


రూ. 5000 రిజిస్ట్రేషన్ ఫీజు జిల్లా యంత్రాంగం తరఫున చెల్లించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు

Post a Comment

కొత్తది పాతది