ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికారులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు(వీడియో)




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..


పినపాక, ఎన్ కౌంటర్  బులెట్ న్యూస్:


ఇందిరమ్మ ఇల్లుతో పేదోడి ఇంటి కల నెరవేరుతుంది అనుకుంటే కళ కళగానే మిగిలిపోతుంది.

పినపాక మండలం గొట్టేళ్ళ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా తమ గోడు చెప్పుకుందామని వస్తే కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని బాధితురాలు విలేకరుల ముందు గోడు చెప్పుకున్నారు.


ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల కోసం సార్ మా పోరాటాలు, మేము నిరుపేదలం మాకు ఇల్లు లేదు , సర్వే చేసుడు కూడా మాకు తెలియదు. మేము వెళ్లి అధికారులను అడిగితే మీ గ్రామానికి 17 ఇల్లులే అని అంటున్నారు. నాకు ఇల్లు లేదు మేము ఎలా బతకాలి అని వారి బాధని చెప్తున్నారు.


పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికారులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు..



Post a Comment

కొత్తది పాతది