ఉపాధ్యాయులు పోక్సో చట్టం, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తతో ఉండాలి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

 



కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


శుక్రవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం కొత్తగూడెం నందు జరుగుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం, బాలికల అక్రమ రవాణా మరియు సైబర్ నేరాల పట్ల ఉపాధ్యాయులందరికీ డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ వివరించడం జరిగినది.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం నేరం చేయడమే కాకుండా, నేరాన్ని దాచిపెట్టడం కూడా నేరంగా పరిగణించబడుతుందని తెలియజేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి పాఠశాల నుండి వెళ్లే వరకు కూడా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, తెలియని కాల్స్ కు సమాధానం ఇవ్వడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయి అందులో ఉన్న సొమ్ము మొత్తం చోరీకి గురవుతుందని , అందుకే అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ సమాధానం ఇవ్వవద్దని తెలియజేయడం జరిగినది.


 ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ N. సతీష్ కుమార్, 1 టౌన్ C.I కరుణాకర్ , S.I విజయ, రిసోర్స్ పర్సన్లు సైదులు, మీరా హుస్సేన్, మురళి హరిబాబు లు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి...హిజ్రా ఉరి వేసుకుని హత్మహత్య


రేషన్ కార్డు ఉన్న వారికి ఆదిరిపోయే శుభవార్త


గ్రేట్ దేవత లాంటి డాక్టరమ్మ


మానవత్వం చాటుకున్న గ్రామస్తులు



Post a Comment

أحدث أقدم