పంచాయతీ ఎన్నికలపై అయోమయం

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

స్థానిక పోరు ఇప్పట్లో రానంటున్నాయ్‌.. ఒకవైపు ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సర్వం సన్నద్ధమైన సామాజికవర్గాల రిజర్వేషన్లు బ్రేక్‌ వేస్తున్నాయి. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయతీ తేలే వరకు స్థానిక ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను ఊరిస్తూ వాయిదాలు వేస్తోంది.


పంచాయితిపోరు ఇప్పట్లో రానంటున్నాయ్‌.. ఒకవైపు ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సర్వం సన్నద్ధమైన సామాజికవర్గాల రిజర్వేషన్లు బ్రేక్‌ వేస్తున్నాయి. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయతీ తేలే వరకు స్థానిక ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను ఊరిస్తూ వాయిదాలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టే అవకాశాలు ఉండడంతో గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అని అభిప్రాయంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచేందుకు సవరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సవరణ కావాలంటే పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఈ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఎన్నికలంటూ ఆశలు కల్పిస్తున్నారు. దీంతో ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు అయోమయంలో పడ్డారు. 2024జనవరి నెలలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలపై ఇప్పటికీ గందరగోళ పరిస్థితి వీడటం లేదు. ప్రస్తుత రిజర్వేషన్ల పరిస్థితుల్లో మరో ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటూ అధికారులు ఆశావహులు ఉన్నారు. అధికార యంత్రాంగం ఓటర్‌ జాబితాతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్‌ గుర్తులతో పాటు సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఆశావహులకు ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు.


బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్?


ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్

Post a Comment

أحدث أقدم