పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, ప్రతినిధి రాజశేఖర్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పక్కా ఏజెన్సీ ప్రాంతంలో చక్కగా విధులు నిర్వహిస్తున్న డాక్టరమ్మ గురించి ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రత్యేక కథనం....
సమాజానికి ఆమె వంతు ఏదో ఒక సహాయం చేయాలనే లక్ష్యంతో ఎంబిబిఎస్ ఉన్నత చదువు చదువుకొని ఎంతోమంది రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యురాలు లక్కీ దుర్గ భవాని.
దేవతమ్మ లాంటి డాక్టరమ్మ దొరకడం పినపాక మండల ప్రజల అదృష్టమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను, వత్తిడిను ఒక శివంగిలా ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారనే చెప్పాలి.
నిరంతరం మారుమూల గ్రామాలు, వలస ఆదివాసి గుత్తి కోయగా గ్రామాలను సైతం సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుంటారని చెప్పొచ్చు.
ఆమె 9వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రికి పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమైనా కూడా పిల్లల్ని చదివించడంలో ఎలాంటి రాజీ పడలేదు తన తండ్రి. మీరు చదువుకోండి అని భరోసా, ధైర్యాన్ని ఇచ్చారు. నాన్న ఆశయాన్ని నిలబెట్టి, గర్వ పడేలా.. వైద్యురాలు కొలువుకి ఎంపికై... సొంత మండలం లోని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించడానికి వచ్చారు.
అనేక మంది రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ... ఎంతో ఓపికగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్య సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ఆమె ఎంతో మందికి ఆదర్శం, స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.
తమదైన శైలిలో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగాయి.
డాక్టర్ దుర్గా భవాని పినపాక వచ్చాకే సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి.
విధులు పట్ల ఆమెకున్న మక్కువతో రోగులను కుటుంబ సభ్యుల వలె చూసుకుంటూ వైద్యం చేస్తుందని పలువురు చెప్పుకుంటున్నారు.
మండల ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.... ఏ సమయంలోనైనా ఆరోగ్య సమస్య వస్తే పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని. సూచిస్తారు.
వందకు వంద శాతం నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న డాక్టరమ్మ సేవలు మరవలెనివి అని చెప్పాలి.
విధి నిర్వహణలో వచ్చే విమర్శలను తిప్పికొడుతూ... తమ బాధ్యతను నిర్వహించడంలో దిట్ట చెప్పొచ్చు.
తనతో పాటు సిబ్బందిని కూడా అప్రమంతంగా ఉంచుతూ... మెరుగైన సేవలు అందించే పనిలో ఉన్నారు.
దేవుడి తర్వాత దేవుడంటారు డాక్టర్లను. అలాంటి గొప్ప వృత్తిని ఎంచుకొని సేవలందిస్తున్న డాక్టర్ దుర్గాభవానికి ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్ తరఫున ప్రత్యేక అభినందనలు.
ఇది కూడా చదవండి...
إرسال تعليق