ముగ్గురు అనుమానిత వ్యక్తులని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ...


 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు...

సారపాక లో పెట్రోలింగ్ నిర్వహించిన ఎస్ఐ రాజేష్...


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సారపాకలో పెట్రోలింగ్ నిర్వహించారు ఎస్ఐ రాజేష్ 12.04.2025 మద్యాన్నం 12:00 గంటల సమయములో బుర్గంపహాడ్ SI E. Rajesh, తన స్టేషన్ సిబ్బంది తో కలిసి సారపాక సెంటర్ వద్ద పెట్రోలింగ్ చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడగా వారిని పట్టుకొని విచారించగా. వారి పేర్లు 1) దొనకొండ సురేష్ బాబు @ చంటి S/o యేసు, 38 yrs, రజక R/o మారుతీ నగర్ పాల్వంచ 2) SK రహీం R/o భద్రాచలం, 3) ఉర్ల శ్రీనివాస్ రావు అని తెలిపి వారి వద్ద రైస్ పుల్లింగ్ మిషన్ ఉన్నదని వేరే వ్యక్తులను నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉంటామని అదే విదంగా చర్ల మండలంకు చెందినా కొమరం రాజ బాబు S/o రామ మూర్తి R/o బతినపల్లి గ్రామం అనునతనికి కూడా రైస్ పుల్లింగ్ మిషన్ ఉన్నదని నమ్మించి అతని వద్ద నుండి లక్ష రూపాయలు తీసుకొని అతను రైస్ పుల్లింగ్ మిషన్ ఇవ్వమని అడుగుతుండగా మరల లక్ష రూపాయలు తీసుకొని బుర్గంపహాడ్ మండలం మణుగూరు x రోడ్ వద్దకు తేది 25.01.25 న సాయంత్రం నాలుగున్నర గంటల సమయం లో రమ్మనగా అతను వచ్చిన తర్వాత అతనిని కొట్టి అతని చేతులో ఉన్న లక్ష రూపాయలు బలవంతగా గుంజుకొని బ్రీజా కారులో మేము మరియు జంగారెడ్డిగూడెం కు చెందిన నారాయణ తో కలసి వెల్లిపోయామని ఈరోజు భద్రాచలం లో ఇంకా ఎవరైనా అమాయక వ్యక్తులకు రైస్ పుల్లింగ్ మిషన్ గురించి చెప్పి వారిని నమ్మించి, డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో భద్రాచలం వెళ్ళుచుండగా సారపాక సెంటర్ వద్దకు రాగ మమ్మల్ని పోలీస్ వారు పట్టుకున్నారు. 


ముద్దాయిల వివరాలు

A1) దొనకొండ సురేష్ బాబు @ చంటి, S/o యేసు (ఆలస్యం), 38 సంవత్సరాలు, చాకలి, 

ఆటో డ్రైవర్, R/o మారుతీనగర్, సీతారాంపట్నం, పాల్వంచ మరియు 

ఇప్పుడు పాల్వొంచ తెలంగాణ నగర్‌లో. A2) SK. అబ్దుల్ రవూఫ్ @ రహీం, S/o అబ్దుల్ షుకూర్, 46 సంవత్సరాలు, ముస్లిం, ఎలక్ట్రికల్ వర్క్, R/o H.No.9-2-30, కొత్తపేట, భద్రాచలం. A3) ఊర్ల శ్రీనివాసరావు, S/o తిరుపణ్యం, 56 సంవత్సరాలు, మాల దాసరి, టైలరింగ్, 

R/o H.No.8-161/A, విజయ కాలనీ, చెర్ల మండలం.


పరారీలో వున్న వ్యక్తి వివరాలు :

A-4 నారాయణ, R/o జంగారెడ్డిగూడెం, A.P రాష్ట్రం. వీరివద్దస్వాధీనంచేసుకున్నవస్తువులు : 1) Cash: Rs.1,90,000/- 2) Phones- 03


బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రజలు ఈ విదంగా రైస్ పుల్లింగ్ మిషన్, గుప్త నిధులు ఉన్నాయని మరియు దొంగ నోట్లు మార్పిడి చేస్తామని అనే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి మోసపోవద్దని మరియు అలాంటి వ్యక్తుల గురించి సమాచారం తెలిసినచో వెంటనే పోలీస్ వారికి సమచారం ఇవ్వగలరని కోరుచున్నాము...








                                                                                                                                

Post a Comment

أحدث أقدم