ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
- ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు
రాత్రి సమయంలో ప్రజలకు ఇబ్బందులు కల్పించే విదంగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించిన.. సమయంలో వాహనాల ద్వారా ఇబ్బందులు కల్పించిన చర్యలు తప్పవని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాత్రి సమయంలో అక్రమంగా ట్రాక్టర్లతో ఇసుకను పెద్దవాగు నుంచి తోలకాలు తోలుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని. అక్రమంగా ఇసుక తోలకాలకు పాల్పడితే ట్రాక్టర్లతో పాటు, డ్రైవర్, ఓనర్ లపై కేసు నమోదు తప్పదని హెచ్చరించారు. రాత్రి సమయంలో కొందరు ట్రాక్టర్ యజమానులు మైనర్ పిల్లలకు మద్యం తాపించి అక్రమంగా ఇసుక తోలకాలు తోలిస్తున్నట్లు సమాచారం వస్తుంది.. అటువంటి వాటిని వహించేది లేదని తెలిపారు. రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తోలకాలు తోలితే పోలిసులకు సమాచారం అందించాలని తెలిపారు..
إرسال تعليق