రాజీవ్ యువ వికాస్ చివరి తేదీ పొడిగించండి


 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

పినపాక: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు తేదీ రేపటితో ముగియనుండగా... పలువురు నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ స్కీమ్ కి అప్లై చేద్దామంటే పలుమార్లు సర్వే డౌన్ అవుతుందని, ఒక్కొక్కరికి గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం వరకు సెలవులు ఉండగా... ఎంతోమంది కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పాలి. అప్లై చేస్కొని వారు ఇంకా చాలామంది ఉన్నందున చివరి తేదీని పొడిగించాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. 


ఇప్పటికే అప్లై చేసుకున్నవారు సంబంధిత పత్రాలను నేడు,రేపు ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వొచ్చు. 










Post a Comment

أحدث أقدم