భూ సమస్యల పరిస్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ -కలెక్టర్ జితేష్ వి పాటిల్ (వీడియో)
byRajashekar news update —0
భూ భారతి చట్టం పై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూ భారతి చట్టం ఈ నెల 14 వ తేదీన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా ప్రజలకు వేగంగా సేవలందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను సివిల్ కోర్టు ద్వారా మాత్రమే పరిష్కరించాల్సి ఉంటుంది అని అన్నారు. భూ భారతి చట్టం ద్వారా ఇలాంటి అంశాలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ లో అప్పీల్ చేయడానికి అవకాశం లేదని , కేవలం సివిల్ కోర్టు ద్వారానే పరిష్కరించడానికి అవకాశం ఉందని, ఈ భూ భారతి చట్టం ద్వారా పిర్యాదు ఆధారంగా ఆర్ డి ఓ, కలెక్టర్ ద్వారా పరిష్కరించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో భూములకు కూడా ప్రభుత్వం భూదాన్ కార్డు జారీ చేస్తారు అని ఆయన అన్నారు . ప్రతి మండలం లో జరుగుతున్న అవగాహన సదస్సులలో పాల్గొని భూ భారతి చట్టం పై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ అవగాహన సదస్సులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో mla పాయం వెంకటేశ్వర్లు ఆర్డిఓ దామోదర్, తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్, mpo వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق