ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న బి టి పి ఎస్ అధికారులు...!

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

కమిషన్లకు కక్కుర్తి పడి తడిచినా యాష్ ను పరిమితి మించి లారీల్లో లోడింగ్ చేసి అమ్ముకుంటున్న వైనం...!


సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి...


మణుగూరు బిటిపిఎస్ నుండి యాష్ ను కమిషన్లకు కక్కుర్తి పడి అమ్ముకుంటున్న బిడిపిఎస్ అధికారులు. బిటిపిఎస్ ప్లాంట్ లో యాష్ ను ఎండబెట్టినంక రవాణా సరఫరా చేయాలా కానీ కమిషన్లకు కక్కుతి పడే బుర్ద యాషును సదర ప్రాంతాలకి రవాణా చేస్తున్నారని మణుగూరుకు ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఈ బూడిద యాష్ వల్ల సదరు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బూడిద రోడ్లకు ఇరువైపుల పడి ఎండిన తరువాత బైక్ మీద కార్ల మీద పాదాచారుల మీద దుమ్ము లేచి ఇబ్బంది పడుతున్నారు అంతే కాకుండా వాహనాలు. అద్దాలపై పడి అద్దాలు కనపడకుండా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ బూడిద వల్ల అనారోగ్యానికి గురి అవుతారు ఇదంతా కమిషనర్లకు కక్కుర్తి పడి బిటిపిఎస్ అధికారులు తమ సొంత సౌలభ్యం కొరకు అమ్ముకుంటున్నారు, ఈ యాష్ వల్ల చాలామందికి శ్వాసకోశ వ్యాధులు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారు వారి గురించి పట్టించుకునే అధికారులు లేరు ఏ పార్టీ అధికారులు కూడా పట్టించుకోని దాకాల లేదని కర్నే రవి గారు మండిపడ్డారు. ఇప్పటికైనా బీటీపీఎస్ అధికారులు పద్ధతి మార్చుకో పోతే త్వరలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని అన్నారు.

Post a Comment

أحدث أقدم