మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు ఎమ్మేల్యే పాయం


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని,

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు పట్టణంలోని చేపల మార్కెట్ ఏరియాలోని కుతుబ్ మసీద్ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సామూహిక నమాజ్ ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ముస్లిం సోదర సోదరీమణులందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది