గ్రంథాలయం పున ప్రారంభించేది ఎప్పుడు?

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఏళ్ల తరబడి మూతపడి ఉన్న వైనం!

నియోజకవర్గ కేంద్రమైన పినపాక మండలం, గ్రామంలో గ్రంథాలయం మూతపడి సంవత్సరాలు గడుస్తున్నాయి. గ్రంథాలయం ఎందుకు మూసేశారని పలువురు విద్యావేత్తల ప్రశ్న? అని చెప్పాలి. గ్రంథాలయం ఉంటే ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా కూడా ఫలితం శూన్యమే అని ఆవేదన చెందుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడే గ్రంథాలయం పునః ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రతిరోజు అన్ని రకాల దినపత్రికలతో పాటు, నవలలు, చిన్న కథలు, కవిత్వం, నాటకాలు, పాఠ్యపుస్తకాలు, ఎన్సైక్లోపీడియాలు, రిఫరెన్స్ పుస్తకాలు ఉంటాయి. గ్రంథాలయం అందుబాటులో ఉంటే మా పిల్లలను ఖాళీ సమయాల్లో అక్కడికి పంపిఇస్తామని వారి తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రంథాలయం అన్ని పుస్తకాలతో పున ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.

Post a Comment

أحدث أقدم