కరకగూడెం: బిగ్ బ్రేకింగ్ న్యూస్... ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్!

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కరకగూడెం మండలం పరిధిలోని గుబ్బల మంగమ్మ గుడి అడవి ప్రాంతంలో పేకాట రాయుల్లు పోలీసులకు పట్టుపడ్డారు. ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. వారి నుండి నాలుగు సెల్ ఫోన్లు, ఐదు బైకులు, 7500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పేకాట జూదం వంటి ఆటలు ఆడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment

కొత్తది పాతది