ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయం: ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*
దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ములకపాడు క్రీడా మైదానంలో మొదలయిన మండల స్థాయి వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ పరితోష్ పంకజ్ ఐపిఎస్,ఏఎస్పీ భద్రాచలం విక్రాంత్ సింగ్ ఐపిఎస్ లు పాల్గొన్నారు.నాలుగు రోజులు పాటు జరగనున్న ఈ మండల స్థాయి వాలీబాల్ పోటీలలో 54 టీమ్ లు పాల్గొననున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతోపాటు క్రీడల్లోను రాణిస్తూ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.దుమ్ముగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంత యువత కోసమే సుమారుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో పోలీసుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.త్వరలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నామని తెలియజేశారు.దుమ్ముగూడెం మండలం నుండి యువత క్రీడల్లో జాతీయస్థాయి వరకు చేరుకొని ఈ ప్రాంతానికి,జిల్లాకి,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు.జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు శాఖ తరపున వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని తమ తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఇటీవల అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో అత్యద్భుత ప్రతిభ కనబరిచి ఇండియా కప్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొంగిడి త్రిష కూడా మన జిల్లా ఏజెన్సీ ప్రాంత వాసి కావడం ఎంతో గర్వకారణం అని తెలిపారు.క్రీడాకారులందరూ అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.అదేవిధంగా ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అనంతరం పోక్సో కేసులలోని నిందితులకు ప్రస్తుత చట్టాలప్రకారం ఏ విధమైన శిక్షలు అమలు అవుతున్నాయో వివరించారు.ఈ వాలీబాల్ మండల స్థాయి టోర్నమెంటును అద్భుతంగా ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులను మరియు భద్రాచలం ఏఎస్పీ గారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో 141 bn అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జునన్,దుమ్ముగూడెం సిఐ అశోక్,ఎస్సైలు వెంకటప్పయ్య,గణేష్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి