శ్రీ రాజరాజేశ్వర (శివాలయం )ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ :

పినపాక మండలం లో గల  సీతo పేట గ్రామానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వరా దేవస్థాన ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. బుదవారం దేవస్థానంలో సమావేశమైన సభ్యులు తొలుత పలు అభివృద్ధి  అంశాలపై , శివరాత్రి మహోత్సవం గురించి చర్చించారు. అనంతరం  ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారు నరేంద్ర,  కొండేరు .వెంకటేశ్వర్లు,  గౌరవ అధ్యక్షులుగా అరే  శంకరయ్య ,  ప్రధాన కార్యదర్శి గా బండారు రామ చందర్ రావు,  కోశాధికారిగా అరే లెనిన్ ప్రసాద్, కొండేరు కృష్ణ మూర్తి ,16 మంది సభ్యులుతో  నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర, కొండేరు వెంకటేశ్వర్లు  సంయుక్తంగా మాట్లాడుతూ ... రాబోయే శివరాత్రి మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి  ఇబ్బందులు రాకుండా , ప్రజలకు  ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు.. ఆలయ అభివృద్ధి కొరకు మా శక్తి మేరకు కృషి చేస్తాం అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో  శ్రీ రాజ రాజేశ్వరా ఆలయ నూతన కమిటీ సభ్యులు అరే శంకరయ్య, బండారు రామ చందర్ రావు, లెనిన్ ప్రసాద్, కృష్ణ మూర్తి,గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు




Post a Comment

أحدث أقدم