ఫైనల్ కు చేరిన ఫైర్ డిపార్ట్మెంట్


జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నీలో భద్రాద్రి ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్..

తుది పోరు నేడే....

పినపాక ఫిబ్రవరి 07 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది.శుక్రవారము బిటిపిఎస్ ఉద్యోగులు వర్సెస్ ఫైర్ డిపార్ట్మెంట్ జట్ల మధ్య మొదటి క్వార్టర్ ఫైనల్ జరగగా.. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున భద్రాద్రి జిల్లా ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్ హాజరై క్రీడలలో పాల్గొని అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ప్రేక్షకులను అలరించారు. హోరా హోరి గా సాగిన ఈ మ్యాచ్ లో ఫైర్ డిపార్ట్మెంట్ విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.అనంతరం ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. నియోజకవర్గంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిపి టోర్నమెంట్ నిర్వహించడం వలన అన్ని శాఖల ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయని అన్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా, ఒత్తిడిలో ఉండే మా లాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గోనడం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తోందన్నారు. నేడు జరిగే ఫైనల్ పోరులో మా జెట్టు ఫైనల్లో ఉంటుందనీ అన్నీ విధాలా పటిష్ఠంగా ఉన్నా మా జట్టు క్రీడాకారులు తుది పోరుకు ఉత్తమ ప్రదర్శన కనబర్చుటకు రెడీగా ఉన్నారు అన్నారు.



Post a Comment

أحدث أقدم