ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
-- పసలేని పనికిమాలిన నిర్మలా బడ్జెట్
-- దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం
-- బీజేపీ బడ్జెట్ లో తెలంగాణకు మొండి చెయ్యి
-- ఆరోపణలు చేసిన పినపాక కాంగ్రెస్ అధ్యక్షులు రామానాదం
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మొదలుపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశ ప్రజల నోళ్లలో మట్టి కొట్టిన బడ్జెట్ అని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం విమర్శించారు.
12 లక్షల ఆదాయము ఉన్నవాళ్లకు పన్ను మినహాయింపులో కూడా కొర్రిలు పెట్టారన్నారు.
దేశంలో రెండున్నర మూడు కోట్ల జనాభా పన్ను కట్టే వారి వారికి తప్ప,బీదవానికి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఏమీ లేదన్నారు.దేశంలో 100 రూపాయల నుంచి 150 ఆదాయం సంపాదించుకొని దాంట్లోనే జీవనం సాగించే పేదవానికి ఒరిగిందేంటని ప్రశ్నించారు. పేద వాడి గురించి ఆలోచించని బడ్జెట్ అవసరమా..? ఈ దేశానికి
మంచినీళ్ల లాగా రోజు ఖర్చు చేసే డీజిల్ పెట్రోల్ మీద ధర తగ్గించడం చేతకాని చెత్త బడ్జెట్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒట్టి చేతులు చూపించిన పరిస్థితి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు నిధులు తీసుకు రాలేని అసమర్థులన్నారు. ముమ్మాటికీ బడ్జెట్ చెత్తకుండీలో చెత్తలాంటిదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రలకు మొండి చెయ్యు చూపిన బీజేపీకి భవిష్యత్ లో ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు.
إرسال تعليق