కాంగ్రెస్ సర్కారు సై అంటోంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు చేస్తూనే, ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటోంది.* ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పరిణామాలను బట్టి పిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధంచేసేందుకు షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం. నిరుడు 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్‌లలో, మునిసిపాలిటీల్లో విలీనం చేశారు. ఇందులో కొన్నింటిని కొత్త మునిసిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆయా గ్రామాల ఓటరు లిస్టులను తొలగించనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ గురువారం ఆదేశాలు జారీచేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో సూచించారు.అనుబంధ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3వ తేదీలోగా ప్రకటించాలని సూచించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి