పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు

 ఘనంగా పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు. 

- అతిధి మర్యాదలు..ఆత్మీయ పలకరింపులు.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.

- గురువులకు ఘన సన్మానం. 

- కార్యక్రమానికి 5 వేల మంది హాజరు.

పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గత 50 ఏళ్లలో ఆ పాఠశాలలో విద్యనభ్యసించి, హాజరైన వారికి పూర్వ విద్యార్థుల కార్య నిర్వాహక కమిటీ మర్యాదలు చేశారు. వచ్చినవారు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని అలనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఎస్ బ్రహ్మారెడ్డి మాట్లాడారు. జాతీయ స్థాయిలో అత్యున్నత సర్వీసుల్లో సేవలంది స్తున్న ఐఆర్ఎస్ లు రాయ వెంకటేశ్వర్ రెడ్డి, కంది ప్రవీణ్, జడ్పీ సీఈఓ గా విధులు నిర్వహిస్తున్న హరిహరనాథ్, ఎన్నారైలుగా స్థిరపడ్డ కంది విశ్వ భరత్ లతో పాటు, పలువురు వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా, వ్యాపార వేత్తలు, ప్రజా ప్రతినిధులుగా ఈ పాఠశాల నుంచి చదువుకుని మంచి ప్రయోజకులు గా తయారయ్యారన్నారు. అనంతరం ఐ ఆర్ ఎస్ లు రాయ వెంకటేశ్వర్ రెడ్డి, కంది ప్రవీణ్ లు మాట్లాడారు. ఈ పాఠశాల నుంచి ఎంతో మంది విద్యావంతులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని, భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా ఎందరో విద్యావంతులు తయారు కావాలనే సదాశయం తో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు శాశ్వత క్రీడా మైదానాన్ని కూడా కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల లో పని చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి సుమారు 5000 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم