-విజేతకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే పాయం
.....
భద్రాద్రికొత్తగూడెం, పినపాక,డిసెంబర్ 26 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామంలో పొట్లపల్లి గ్రామపంచాయితీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు పొట్లపల్లి యూత్ సభ్యులు నిర్వహించిన తిల్కా మాఝీ వాలీబాల్ ఫైనల్ పోటీలకు ముఖ్యఅతిథిగా పినపాక శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు విచ్చేసి స్వయంగా ఫైనల్ పోటీలను తిలకించారు. మొదటి విజేతగా గెలుపొందిన ఆసుపాక టీం సభ్యులకు 20,000 వేల రూపాయలు, రన్నర్స్ గా రాజుపేట టీం సభ్యులకు 15,000 వేల రూపాయలు, తృతీయ బహుమతి నీ పోట్లపల్లి టీం సభ్యులకు 10,000 వేల రూపాయలు, ఫోర్త్ ప్లేస్ అమరారం టీం సభ్యులకు 5,000 వేల రూపాయల బహుమతులను అందజేశారు.అనంతరం పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 23వ తారీకు నుంచి 26వ తారీకు వరకు వాలీబాల్ పోటీలను ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు, క్రీడల్లో గెలుపు ఓటమి సహజమేనని ఓటమిపాలైన వారు ఎవరు కూడా నిరుత్సాహ పడకూడదని ఓటమి కూడా ఒక అనుభవంగా తీసుకోవాలని అలా తీసుకున్న రోజే మరెన్నో విజయాలు పొందుతామని తెలియజేశారు. యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రోజున మీరు ఆడే వాలీబాల్ క్రీడ పోటీలలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆడి మీ ప్రతిభను చూపించాలన్నారు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని అనారోగ్య సమస్యలు దరిచేరవని ఏప్పుడు ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు క్రీడాకారులకు అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తామని తెలియజేసి గెలుపొందిన ఆసుపాక టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బయ్యారం ఎస్సై ఇ .రాజ్ కుమార్ మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, జీవితం కూడా ఆటలో ఒక ఉదాహరణ అన్నారు. ఓడినవారు పొరపాట్లు ఎక్కడ చేశామో సరిదిద్దుకోవాలని మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి