సత్తుపల్లి: ఘోరం లారీ, డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;



సత్తుపల్లి పట్టణం కిష్టారం ఓసీ నుంచి రుద్రంపూర్ కు బొగ్గు లోడుతో వెళుతున్న లారీ, ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపుకు నిమ్మకాయల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలో బుధవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టిప్పర్ డ్రైవర్ శివకుమార్ (రుద్రంపూర్), డీసీఎం డ్రైవర్ కే. రవి (కృష్ణాజిల్లా)లను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.

Post a Comment

أحدث أقدم