కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామం చెందిన కొమరం నాగేశ్వరరావు (40) అనారోగ్యం తో ఇటీవల హైదరాబాద్ గాంధీ ప్రభుత్వ హాస్పటల్లో మృతి చెందారని అతనికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో దిక్కతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని ఎంతో బాధపడుతూ హృదయ విధానకర సంఘటన గుర్తు చేసుకుంటూ వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామం ఏ జి హెచ్ ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు అయిన పూనెం రోజారాణి గారు ఆ కుటుంబంకు సహాయం చేయాలని ఉద్దేశంతో మానవతా దృక్పథంతో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబంకు అండగా నిలవాలని కష్టాలు ఎవరికీ చెప్పిరావు సమాజంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా మానవతా విలువను కోల్పోకూడదని వారు తెలియజేశారు.
إرسال تعليق