భద్రాద్రి కొత్తగూడెం: రేపు ఉద్యోగ మేళా



భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 16న( రేపు) నిర్వహించనున్న ఉద్యోగమేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెరీనా పెయింట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో వివిధ జిల్లాలలో గల 2190 ఉద్యోగాలకు డిగ్రీ ,ఐటిఐ, బిటెక్, ఎంటెక్ అర్హత .24 నుంచి 40 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగులు కొత్తగూడెం బాబు క్యాంప్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఉద్యోగమేళాకు అర్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

Post a Comment

أحدث أقدم