కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెం:మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మారుతి నర్సింగ్ కాలేజ్,లయన్స్ క్లబ్ భద్రాచలం సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహించింది.
ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ జి. సంజీవరావు పర్యవేక్షణలో మొత్తం 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 60 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేసి,రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. సంజీవరావు మాట్లాడుతూ...ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అని కొనియాడారు.ప్రజల స్పందన చాలా ఉత్తేజకరంగా ఉందన్నారు.పేద ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య సేవలు మరింతగా అందించాలని స్వచ్ఛంద సంస్థలను అభ్యర్థిస్తున్నాని పేర్కొన్నారు.
అనంతరం సంస్థ నిర్వాహకులు మాట్లడుతూ...ఈనెల 16 న 60మందిని సికింద్రాబాద్‌కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినట్లు పేర్కొన్నారు.ఈ శిబిరానికి వచ్చేవాళ్లు ఉచితంగా ప్రత్యేక వాహనం,భోజనం వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులను,నిర్వాహకులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా. ఎస్.ఎల్. కాంతారావు, రాజిరెడ్డి,ఆదినారాయణ,సూర్యనారాయణతో పాటు గ్రామస్తులు గొగ్గల నారాయణ, ఈసం సమ్మయ్య,ఈసం సత్యం,కొమరం లక్ష్మీనర్సు,జోగ దూలయ్య,ఈసం రామకృష్ణ,తోలెం జితేందర్,మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق