తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ : రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని శాఖల అధికారులతో పరిస్థితి సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వర్షాలు కారణంగా అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సీఎం తెలిపారు. సీఎస్, డీజీపీ, హైడ్రా కమిషనర్‌కి సీఎం ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశాలిచ్చారు.
إرسال تعليق