నాసిరకం రోడ్డు పనులు.... కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి



అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామం వద్ద కొత్తగా నిర్మించిన వంతెన దగ్గర రహదారి బీటలు బారింది. గుత్తేదారు నాసిరకం పనులు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. దిని పై అధికారులు నాసిరకం పనులు చేసిన గుత్తేదారుడు పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 


అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు దార పోసి రహదారి నిర్మాణాలు చేపట్టాలని గుత్తే దారులకు ఒప్పజెప్పితే నాసిరకం పనులతో ప్రభుత్వం ధనాన్ని బూడిదల పోసిన పన్నీరు లాగా వృధా చేస్తున్నారని చెప్పాలి. అధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Post a Comment

أحدث أقدم