చిన్నరాయిగూడెంలో అడ్ హాక్ కమిటీని ఎన్నుకున్న డిసిఓ అధికారులు

 


 సమ్మక్క సారక్క ఇసుక ట్రైబల్ సొసైటీ చిన్నరాయిగూడెం


 మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిన్నరాయిగూడెం గ్రామంలో డి సి ఓ కార్యాలయం నుండి డి.రాజు అసిస్టెంట్ రిజిస్టార్, ఎ ఎస్ ఆర్ హనుమాన్ సీనియర్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో సొసైటీ సభ్యుల మధ్య అడ్ హాక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.


ఈ కమిటీలో 154 మంది సొసైటీ సభ్యుల నుండి సమ్మక్క సారక్క ఇసుక ట్రైబల్ సొసైటీ బైలా ప్రకారం ముగ్గురు కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడాలి కానీ రెండు వర్గాల నుండి నలుగురు పోటీకి రావడంతో ఎన్నిక అనివార్యమైంది. 


ముగ్గురు సభ్యులకి 109 మంది ఏకగ్రీవంగా,ఒక సభ్యురాలికి ఏ విధమైన మద్దతు లభించకపోవడంతో సొసైటీ సభ్యులు ప్రతిపాదించిన ఆ ముగ్గురిని అధికారులు ఏకగ్రీవంగా అడ్ హాక్ కమిటీ సభ్యులుగా సొసైటీ సభ్యుల మధ్యలో సంతకాల సేకరణతో తీర్మానించారు. 


పూర్తిగా పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నిక వీడియో కెమేరా పర్యవేక్షణలో రికార్డు చేయబడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై మనీషా తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఏదైనా విషయంపై రిపోర్టు కోరుతూ కొంతమంది అధికారులతో ఏర్పాటు చేసే ప్యానెల్‌నే అడ్ హాక్ కమిటీ అంటారు. ఏదైనా అంశంపై తుది రిపోర్టు సమర్పించడంతో అడ్ హక్ కమిటీ పని పూర్తవుతుంది.


 అంటే తాత్కాలిక కమిటీ అని అర్థం చేసుకోవాలి. ఈ కమిటీ సమ్మక్క సారక్క ఇసుక ట్రైబల్ సొసైటీ బైలా ప్రకారం నెల రోజులు ఉంటుంది. 


ఈ నెల రోజుల్లోపు ఈ ముగ్గురు సభ్యులు ఎలక్షన్ పెట్టి పూర్తి సొసైటీ సభ్యులను ఎన్నుకుంటారు అని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది