పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈ రోజు అనగా ది:07-05-2025 న గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక మండలంలో సుడిగాలి పర్యటన చేశారు.
మంత్రి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం, పార్టీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు.
గొట్టెల గ్రామంలో నిరుపేద లబ్ధిదారుల ఇందిరమ్మ గృహానికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు.
అర్హులైన నిరుపేదలకు తప్పకుండా దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇస్తామని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ , డి.ఎస్.పి ,డి ఎల్ పి ఓ వివిధ శాఖల డీఈలు మండల అధికారులు , పోలీస్ శాఖ. వారు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.
إرسال تعليق