పినపాక: 8 లీటర్ల నాటు సారా పట్టివేత



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఈ రోజు అనగా  ఉదయం పినపాక మండలం జానంపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించుచుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం గమనించి, అతనిని ఆపి తనిఖీ చేయగా, అతని వద్ద (08) లీటర్ల నాటు సారా పట్టుబడినది. అతనిని విచారించగా, అతని పేరు భూక్య రామారావు అని,అతను పినపాక మండలం దుగినేపల్లి గ్రామస్తుడని తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకొని, నాటు సారా, తాగి  ద్విచక్ర వాహనం ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయబడినది. మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా మరియు నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక అమ్మినా, సరఫరా చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని  CI రాజిరెడ్డి తెలిపారు. కావున ఎవరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో  కానిస్టేబుల్ లు శ్రీను, ఆంజనేయులు, సతీష్ మరియు ప్రసన్న కుమార్ లు పాల్గొన్నారు. 


Post a Comment

أحدث أقدم