తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త అందింది.
రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక ప్రకటన వెలువడింది.
జూన్ రెండో తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కాబోతున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.
దీనికోసం 6,000 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 13.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పథకానికి అప్లై చేసి ఉన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ఎంతమందికి లోన్ అందుతుందనేది తెలియాల్సి ఉంది.
ఎవరు అర్హులు?
గ్రామీణ ప్రాంత నివాసితులకు సంవత్సరానికి ₹1.5 లక్షలు మరియు పట్టణ ప్రాంత నివాసితులకు ₹2 లక్షలు . వ్యవసాయేతర వ్యాపారాలకు వయస్సు అర్హత 21 నుండి 55 సంవత్సరాల వరకు మరియు వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు 60 సంవత్సరాల వరకు ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో 6,000 కోట్ల బడ్జెట్‌తో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
సిబిల్ స్కోర్ ఉంటేనే లోనుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రకటన విడుదల చేసింది.
ఓవైపు నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాస్ కి అప్లై చేసుకొని కొండంత ఆశతో వేచి చూస్తున్నారనే చెప్పాలి.
ఇది కూడా చదవండి...పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్..
إرسال تعليق