మణుగూరు: ఆరుగురుపై కేసు నమోదు

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

ప్రభుత్వం భూమిని కబ్జా చేసిన వ్యక్తులు....

మణుగూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..

నిన్న మణుగూరు మండల ఎమ్మార్వో శ్రీ రాఘవ రెడ్డి  ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా గుట్ట మల్లారంలోని సర్వేనెంబర్ 49 మరియు 33 లో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నారని వారిపై కేసులు నమోదు చేయమని దరఖాస్తు ఇవ్వగా కింద పేర్కొన్న వ్యక్తులపై చీటింగ్ మరియు మోసం అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడమైనది. 

ఇందులో బేతంచెర్ల వెంకటేశ్వర్లు @ గిన్నెల కొట్టు వెంకటేశ్వర్లు మరియు గోవర్ధన్ అనే వ్యక్తులు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మినారని ఇవ్వగా క్రింద పేర్కొన్న వ్యక్తులపై కూడా

 1. డేగల వెంకట్ 2. కత్తి రాము 3.బొడ్డు పుల్లారావు 4.అబ్రహం 5.సతీష్ 6. అక్కినపల్లి ప్రదీప్ శాస్త్రి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.

అదేవిధంగా బేతంచర్ల వెంకటేశ్వర్లు మరియు గోవర్ధన్ అనే వ్యక్తులు ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చెబుతూ పలు వ్యక్తులకు అమ్మినారని తెలిసింది. ఎవరైనా బాధితులు ఉంటే స్టేషన్లో దరఖాస్తు ఇస్తే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడుననీ మణుగూరు సీఐ తెలిపారు.


ఇది కూడా చదవండి...అశ్వాపురం: చికెన్ లో పురుగుల కలకలం










Post a Comment

أحدث أقدم