భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
జిల్లా లో త్రాగు నీటికి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుండి నీరు విడుదల. రానున్న రోజుల్లో జిల్లా వాసులకు త్రాగు నీటి కి ఇబ్బంది రాకుండా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ తో మిషన్ భగీరథ మరియు ఇరిగేషన్ అధికారుల సమన్వయతో మంగళవారం తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుండి అధికారులు 300 క్యూసెక్కుల నీటి ని దిగువకు విడుదల చేయడం జరిగిందని, ఏప్రిల్, మే నెలలో త్రాగు నీటికి ఇబ్బంది తలత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా నీటిని విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు.
إرسال تعليق