తహసిల్దార్ మీరు గ్రేట్... నిరుపేద యువకుడికి అండగా నిలిచిన మణుగూరు తహసీల్దార్

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పెద్దిపెల్లి గ్రామానికి చెందిన పొడియం దేవా  ఇటీవల తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిపోయింది. అతను హాస్పిటల్‌లో చేరినా, ఆరోగ్య శ్రీ కార్డు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆపరేషన్ చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. వైద్యులు అతని కాలి శస్త్రచికిత్స కోసం ₹90,000 ఖర్చు అవుతుందని తెలిపారు.


ఈ విషయం తెలుసుకున్న మణుగూరు మండల తహసీల్దార్ రాఘవరెడ్డి గారు మానవతా ధృక్పథంతో స్పందించి, స్వంత డబ్బులతో అతన్ని హైదరాబాద్‌కు పంపించి, ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందేలా చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్  చొరవతో దేవాకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించబడింది, ప్రస్తుతం అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది.


తహసీల్దార్ రాఘవరెడ్డి  మానవీయ స్పందన పట్ల గ్రామస్థులు, దేవా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, "ఇలాంటి మంచి అధికారులే సమాజానికి అవసరం" అని ప్రశంసించారు. "పేదవాళ్ల కష్టాలను చూసి వెనుకంజ వేయకుండా, తన సొంత డబ్బులతో సహాయం చేసి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించడానికి ప్రయత్నించడం తహసీల్దార్ గొప్ప మనసు....

సంపన్నులు ఎందరో ఉంటారు కానీ సహాయం చేయాలని ఆలోచన కొందరికే ఉంటుంది. మానవసేవే మాధవసేవ అన్నాడు ఒక మహాకవి. 

Post a Comment

أحدث أقدم