*నవ తెలంగాణ, దిశ క్యాలెండర్లు ఆవిష్కరణ..*
*నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..*
కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నవ తెలంగాణ పత్రికా రిపోర్టర్ సాయి కిరణ్ మరియు దిశ పత్రికా రిపోర్టర్ ప్రవీణ్ ల 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సమాజానికి జర్నలిజం ఎంతో అవసరమని, సమాజంలో జరిగే పరిస్థితులను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయడంలో మీడియా ముందుంటుందని అన్నారు..మీడియా ప్రతినిధులకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..ప్రస్తుత సమాజంలో మీడియా ఎంతో కీలకమనీ, సమాజంలో జరిగే పరిస్థితులను సమస్యలను అధికారులకు ప్రజలకు తెలియజేయడంలో మీడియాదే కీలకపాత్ర అన్నారు..అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియా రంగాన్ని అభినందించారు..
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు దొంతు మల్లయ్య, గాంధర్ల రామనాథం , దుర్గం కన్నయ్య ,ఎండి ఆశ్ర ఫునీస, పోలెబోయిన సుజాత, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఇల్లందుల సురేష్, బట్ట బిక్షపతి, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు..
إرسال تعليق