బీజాపూర్ లో ఎన్ కౌంటర్ - ఇద్దరు మావోయిస్టుల మృతి
వివరాలు వెల్లడించిన బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడ పొలీస్ స్టేషన్ పరిధిలోని నేడ్ర అటవి ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.నెండ్ర అడవుల్లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు బీజాపూర్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పొలీసు అధికారులు సిఆర్ పిఎఫ్,బస్తర్ ఫైటర్స్, ఉమ్మడి బృందాన్ని సెర్చ్ ఆపరేషన్ కోసం పంపారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడటంతో ఇరువురి మద్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ప్రాంతంలో అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కవ్వాసి హంగా సొమద కల్ముల పై బాసగూడ పొలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయని అన్నారు.సొమదా కల్ము పై ఆవుపల్లి పొలీసు స్టేషన్ లో శాశ్వత వారెంట్ పెండింగ్ లో ఉండగా అతనిపై లక్ష రివార్డు ఉందని కాగా తిమ్మాపూర్ అంగన్ వాడీ కార్యకర్త హత్య ఘటనలో ప్రవేయం ఉందన్నారు.ఎన్ కౌంటర్ అనంతరం ఆ ప్రాంతంలో గాలించిన భద్రతా బలగాలకు12 బోర్ సింగిల్ షాట్ గన్,కంట్రీమేట్ గన్, 5 కిలోల టిఫిన్ బాంబ్, ప్రింటర్స్,మావోయిస్టు యూనిఫాం,వైర్ లెస్ సెట్, బ్యాటరీలు,సాహిత్య పుస్తకాలు,ఇతర వస్తువులు లభించినట్లు ఆయన తెలిపారు.
إرسال تعليق