మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య..


 
ఖమ్మం/తల్లాడ డిసెంబర్ 9 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



ఖమ్మం జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందనే మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సారధి నగర్ మామిళ్లగూడెంలో నివాసం ఉండే మెడికల్ రిప్రజెంటేటివ్ కుమార్తె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదువుతోంది. కొద్ది రోజులుగా పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో మధ్యాహ్నం వేళ పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాస్తోంది.
ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం పెన్ను కొనుక్కొని వస్తానని చెప్పి ఇంటికి ఆలస్యంగా రావడంతో బాలిక తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని క్షణికావేశంలో ఇంటి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ భాస్కరరావు, సీఐ అంజలి తెలిపారు.

Post a Comment

أحدث أقدم