- టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ధర్మరాజుల శంకర్
పినపాక ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
అభివృద్ధి పేరుతో రైతులు ఎంతోకాలంగా పంట పండించుకున్న భూములను లాక్కొని రైతులను ఏడిపించవద్దని టిడిపి పినపాక మండల కార్యదర్శి ధర్మరాజుల శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన జానంపేట మండల కేంద్రంలో మాట్లాడారు. పినపాక మండలం గోపాలరావుపేటలో నవోదయ స్కూల్ కోసం మూడు తరాలుగా సన్నా చిన్నకార రైతులు సాగు చేస్తున్నటువంటి భూమిని ప్రభుత్వం ఆక్రమించుకోవడం సబబు కాదన్నారు .దీనికి ప్రత్యామ్నాయంగా వేరే భూమిని చూసుకోవాలని, అభివృద్ధి అనేది అవసరమే కాని దాని పేరు మీద రైతులకు నష్టాన్ని చేకూర్చడం మంచిది కాదన్నారు .ఇప్పటికే రైతుల భూములు పరిశ్రమల పేరు మీద భూములు పోయాయని, తప్పకుండా ప్రభుత్వం దీనిపై స్పందించి వారిని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల తరపున తెలుగుదేశం పార్టీ అండగాఉంటుందని, త్వరలోనే ఆ 126 ఎకరాల భూమి వద్ద పర్యటించి రైతుల పక్షాన నిలబడతాం అన్నారు.
إرسال تعليق