పోడు భూములపై ఆదివాసులకు హక్కు కల్పించాలి

 పోడు భూములపై ఆదివాసులకు హక్కు కల్పించాలి.

ఏ.ఎస్.పి. ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్.

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

ఆదివాసుల సాగులో ఉన్న పోడు భూములపై హక్కు కల్పించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ డిమాండ్ చేశారు.మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో ఆసంఘం సమావేశం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు అధ్యక్షతన మంగళవారం జరిగినది. సమావేశంలో పాల్గొని సతీష్ మాట్లాడుతూ..భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో ఆదివాసులకు ప్రత్యేక చట్టాలను పొందుపరిచి నప్పటికీ ఆచరణలో చట్టాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని ఆవేదన చెందారు.1/70 చట్టం అమల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ అధికారులు ఆదివాసీల అభివృద్ధిపై ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.పోడు భూములపై ఆదివాసులకు హక్కు కల్పించకుండా అటవీ అధికారులతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దౌర్జన్యంగా భూములను నుండి గెంటివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం,ముత్తారం, తిప్పాపురం,సీతారాంపురం గ్రామాలలో ఆదివాసులు సాగు చేస్తున్న పోడుపోములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మడకం రమేష్, తుమ్మ సురేష్ కోర్స సారయ్య,తాటి శ్రీను, సోడి రాజు,మడకం దేవి, కుంజ జానకి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم