బయ్యారం క్రాస్ రోడ్‌లో వాహన తనిఖీలు

G Rajashekar
By -
0







EB NEWS/ పినపాక:


పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.


ఈ సందర్భంగా కానిస్టేబుల్ లక్ష్మణ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)