సమ్మక్క–సారలమ్మ జాతరతో ఖమ్మం ఆర్టీసీకి రూ. 3.28 కోట్ల ఆదాయం



ఉమ్మడి ఖమ్మం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మేడారం వెళ్లిన భక్తులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఖమ్మం రీజియన్‌కు మొత్తం రూ. 3,28,39,181 ఆదాయం సమకూరినట్లు రీజినల్ మేనేజర్ శ్రీరామ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి మొత్తం 214 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆయన వెల్లడించారు. జాతర సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Post a Comment

కొత్తది పాతది