పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గోపాలరావుపేట గ్రామంలో గోపాలరావుపేట మెగా క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఉడుముల ఐలయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు. క్రికెట్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా పండగ సందర్భంగా గోపాలరావుపేట గ్రామ యూత్ తరఫునుండి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభిస్తామని తెలిపారు. సుమారుగా 50 క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా 30 వేల రూపాయలను ఉపేంద్ర ఎలక్ట్రికల్స్, రెండవ బహుమతి 20వేల రూపాయలు డిజె సత్తి జ్ఞాపకార్ధంగా ఇవ్వనున్నారని తెలిపారు. పినపాక మండలంలో ప్రతి ఒక్కరు క్రికెట్ మ్యాచ్లకు హాజరై వీక్షించాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బిల్లా నాగేందర్, నిట్టా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు ఉడుముల ఐలయ్య, కొంపెల్లి మల్లేష్, కొంపల్లి సంతోష్, ఉడుమల రామచంద్రు, నిర్వాహకులు జలగం అశోక్, కొంపెల్లి నాగేష్, రేస్ కోటేశ్వరరావు మార్తా మనోజ్, మొదలైన వారు పాల్గొన్నారు.

إرسال تعليق