అశ్వారావుపేట: ఎమ్మెల్యే జారే చొరవతో తీరిన కష్టాలు..



అశ్వారావుపేట, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి సతీష్ గౌడ్:


అశ్వారావుపేట మండలంలోని, రెడ్డిగూడెంలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. త్రాగునిరు మోటార్ పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. నీటి కష్టాలు తీర్చాలని రెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మల లచ్చి రెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు చిప్పల కొమ్మిరెడ్డి, గ్రామస్తులు ఇటీవల ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను కలిసి చెప్పడం జరిగింది...త్వరలోనే మోటార్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మోటార్ అందించారు. తమకు తాగునీటి కష్టాలు తొలగించిన ఎమ్మెల్యే జారే కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల కాంతారావు, ఉమ్మల జాపిన్ రెడ్డి, ఉమ్మల ధాసిరెడ్డి, ఉమ్మల వెంకటరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم