భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఒప్పంద ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.ప్రపంచ బ్యాంకు సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్ పథకానికి ఒప్పంద పద్ధతిలో మేనేజర్, సహాయ మేనేజరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్య ర్థులు ఈ నెల 10వ తేదీలోపు www.nimsme.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఐ డి ఓ సి కార్యాలయంలో ని పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
إرسال تعليق